మదీనా మస్జిద్ అధ్యక్షునిగా ముజాహిద్ ఖాన్.
మహదేవపూర్-నేటిధాత్రి:
మండల కేంద్రంలోని మదీనా మస్జిద్ కార్య నిర్వహణ కమిటీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా ఎండి ముజాహిద్ ఖాన్, తోపాటు ఉపాధ్యక్షులు, ఎండి షఫీ ఖాన్, షంషీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, సంయుక్త కార్యదర్శి, మొహమ్మద్ అహ్మద్ బీసీ ఎలక్ట్రిషన్, కోశ అధికారిగా అస్రార్ ఖురేషి, కార్యవర్గ సభ్యులుగా, షేక్ నసీం, మొహమ్మద్ అలిమ్, మహమ్మద్ అల్తాఫ్, మొహమ్మద్ యాకూబ్, మహమ్మద్ అలీమ్ లను సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ముఖ్య సలహాదారులుగా, అన్సార్ ఖురైషి, మొహమ్మద్ కరీం ఖాన్, ఎండి మసూద్ అలీ. లను ఎన్నుకోవడం. ఈ సందర్భంగా అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ మాట్లాడుతూ మస్జిద్ సేవకు ఎన్నుకోవడం అల్లాహ్ ఇచ్చిన వరమని, కార్యవర్గం అంతా మస్జిద్ తో పాటు ముస్లింల ఉన్నతి సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు సహాయ శక్తుల ప్రయత్నిస్తామని, ముస్లిం సోదరులందరికీ కమిటీ తరపున అధ్యక్షులు ముజాహిద్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.