పరకాల నేటిధాత్రి
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు పరకాల బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికే ఉంటుందని పరకాల మండలం లక్ష్మీపురం గ్రామ ముదిరాజు కులస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు.బుధవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో చల్లా ధర్మారెడ్డిని ముదిరాజ్ కులస్థులంతా కలిసి మద్దతు తెలిపారు.తమ స్వార్ధాల కోసం పార్టీ మారిన వారికి తగిన గుణపాఠం చెపుతామని వెల్లడించారు.తన గెలుపుకోసం ముదిరాజు కులస్థులంతా ఏకతాటిపైకి వచ్చి నాకు మద్దతు తెలిపినందుకు చల్ల ధర్మారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికలు రాగానే ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని,ప్రజా సంక్షేమమే ఎజెండాగా పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ కి మనమంతా అండగా నిలిచి మద్దతు తెలిపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్థులు,నాయకులు గురిజాపల్లి ప్రకాష్ రావు,మాజీ ఎంపిటిసి పల్లెబోయిన రాజయ్య,మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి అశోక్,పల్లెబోయిన రవీందర్,ఆముదాలపల్లి శ్రీనివాస్,గ్రామపార్టీ అధ్యక్షులు పల్లెబోయిన రాజు,మాజీ డైరెక్టర్ పల్లెబోయిన సురేష్,మాజీ డైరెక్టర్ దానం నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.