నర్సంపేట,నేటిధాత్రి :
ముదిరాజు కులస్తులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్, ఎన్నారై విభాగం రాష్ట్ర ఇంచార్జ్ శానబోయిన రాజ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు జినుకల కొమ్మాలు ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మైనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అభయహస్తం లో భాగంగా ముదిరాజులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని వారు అన్నారు.ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను నర్సంపేట కేంద్రంలో ఆవిష్కరించారు.
ప్రభుత్వం ముదిరాజులకు ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.చెరువులు కుంటల పై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలని కోరారు.త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పించాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీప్ ప్రమోటార్ చొప్పరి సోమయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం,జిల్లా నాయకులు గుంటుక సోమయ్య, గోనెల నరహరి, వివిధ మండలాల అధ్యక్షులు నూనె నర్సయ్య, దామ సాంబయ్య,తోట సాంబయ్య, పల్లె రమేష్, పట్టణ నాయకులు కీసరి వెంకటేశ్వర్లు, నాయిని వేణుచంద్, డ్యాగల కిరణ్, మౌటం రవి, బొల్ల స్వామి, పెండ్యాల సారయ్య, మత్స్యశాఖ సొసైటీ బాధ్యులు, వివిధ గ్రామాల పెద్దమనుషులు పాల్గొన్నారు.
ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చాలి
