ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
కేసముద్రం/ నేటి ధాత్రి
ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవ పోస్టర్ ను హైదరాబాదులో బుధవారం ఆవిష్కరించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ మాట్లాడుతూ ఈనెల 21 ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి గ్రామాన సంఘం నాయకులు పతాకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్ ముదిరాజ్, ఫిషరీస్ కార్పొరేషన్ చీఫ్ ప్రమోటర్ కొత్త రమేష్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి పిట్టల ధనుంజయ్ ముదిరాజ్, ఎదురబోయిన సూరయ్య ముదిరాజ్ పాల్గొన్నారు.
