ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజ్ కులస్తులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.