
Mudigunta Village Faces Severe Water Shortage
నీటి సమస్య ఎదుర్కొంటున్న ముదిగుంట గ్రామస్తులు
నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
జైపూర్,నేటి ధాత్రి:
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న త్రాగునీటి కోసం పడిగాపులు కాస్తూ కష్టాలు ఎదుర్కొంటున్న వైనం జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని కొత్తగూడెం కాలనీలో చోటు చేసుకుంది.కాలనీలోని బోర్ వెల్ మోటార్ చెడిపోయి నెలరోజుల పైన గడుస్తున్న పట్టించుకోనే వారు కరువయ్యారు.నీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి వారి ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిరోజు నిత్య అవసరాలకు,త్రాగడానికి వాడుకునే నీరు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు.మోటార్ చెడిపోయి నీటి సమస్య ఎదుర్కొంటున్నామని గ్రామపంచాయతీ వారికి తెలియజేసిన సరైన నిధులు లేవని మీరే సొంత ఖర్చులతో బాగుచేసుకోవాలని అంటున్నారని తెలిపారు.ఒక్క మోటార్ ను మరమ్మత్తు చేయించలేనంత దీని స్థితిలో గ్రామపంచాయతీ వ్యవస్థ ఉందా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరారు.