జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కొలుపు. ప్రతి గౌడ కుటుంబంలోని ఆడపడుచులు బోనాలు తీస్తూ మేళ తాళాలతో డప్పు చప్పులతో ఒగ్గు కళాకారులతో పట్నం వేపించి శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిమునిల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేడుకల జరిపించాలని గౌడ సంఘ పెద్దలు కులస్తులు గ్రామ ప్రజలు కలిసి మంగళవారం రోజున మీటింగ్ నిర్వహించి ఎల్లమ్మ కొలుపుకు సంబంధించిన అన్ని విషయాల గురించి చర్చించి అలాగే ఈ నెల 24, 25, 26,27 తేదీల్లో ఎల్లమ్మ తల్లి కొలుపు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు నుండే గుడి శుద్ధి చేస్తూ గుడి యొక్క ముస్తాబు పనులు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ భక్తులు చుట్టుపక్కల గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ నాలుగు రోజులు గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొని ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని భక్తిశ్రద్ధలతో పూజించుకొని ఎల్లమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని భక్తుల్ని ప్రజల్ని కోరడం జరిగింది.