నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
భారతీయ జనతా పార్టీ చండూరు మండల అధ్యక్షునిగా చామలపల్లి గ్రామానికి చెందిన ముదిగొండ ఆంజనేయులు నియమితులయ్యారు. నల్లగొండలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి గారి చేతులమీదుగా నియామక పత్రంను అందుకున్నారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండూరు మండలంలో పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, నిరంతరం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, మోడీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, రాబోవు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డికు,అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం కు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు కోమటి వీరేశం, మాజీ మండల అధ్యక్షులు కాసాల జనార్దన్ రెడ్డి మరియు పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, యాస అమరేందర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు సోమ నరసింహ, జిల్లా కార్యదర్శి దర్శనం వేణు, నాయకులు బోడ ఆంజనేయులు, తడకమల్ల శ్రీధర్, నరాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.