ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం
సమన్వయ కమిటీ ఇంచార్జిగా బరిగెల ఏలీయా నియామకం
నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:-
అయినవోలు మండల్ ఎంఆర్పిఎస్. ఎంఎస్పి అనుబంధ సంగాల అధ్యక్షులు చింత అశోక్ మాదిగ, ఇసురం బాబు అధ్యక్షతన మంగళవారం మండల కార్యవర్గం సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొక్కల నారాయణ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారంగా వర్గీకరణలో కమిషనర్ ఇచ్చిన రిపోర్టును సరిదిద్దుకొని ఏబిసిడిలుగా విభజించి జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు మరియు ఉపకులాలకు రావలసిన వాటా జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేసి అధికారికంగా వర్గీకరణ ప్రకటించాలని కోరారు. అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ను నిలిపివేసి వర్గీకరణ అయిన తర్వాతనే నియామకాలు చేపట్టాలని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. ఐనవోలు మండల సమన్వయ కమిటీ ఇన్చార్జి గా నందనం గ్రామానికి చెందిన బరిగల ఏలియాను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. రేపటినుండి జరిగే కార్యక్రమాలను మరియ ఉద్యమ నిర్మాణాలను విజయవంతం చేయుటకు ఈ కమిటీ పనిచేస్తుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల సీనియర్ నాయకులు బర్ల బాబు,కట్కూరి రమేష,సింగారపు చంద్రమౌళి,మరుపట్ల దేవదాస్, బరిగేల ఆరోగ్యం,ఆరూరి కుమారస్వామి, బొక్కల అనిల్ మాదిగ. మాదాసి కరుణాకర్ ఆకులపల్లి సాగర్, జలగం ఎల్ల కుమార్, ఆకులపల్లి రాజు,కట్కూరి అరుణ్ మాదిగలు పాల్గొన్నారు.