
Foundation Day Celebrations.
ఎమ్మార్పిఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మైకీల్ మాదిగ ఝరాసంగం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రాయికోటి నర్సింములు విహెచ్పిఎస్ జిల్లా నాయకులు సమన్వయంతో ఝరాసంగం మండలం కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆత్మ గౌరవ పతాక ఆవిర్భావ వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన అబ్రహం మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు, ఉల్లాస మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ లు మాట్లాడుతూ సామాజిక న్యాయం పునాదిగా ముప్పై ఏళ్ల పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించి మాదిగ జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా భారతీయ సమాజంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు నిలిచిపోయారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో సైతం ఉద్యమం నడిపిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు మాత్రమే దక్కిందని అన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిన ఘనత ఒక్క ఎమ్మార్పీఎస్ దేనని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ ఉద్యమం చేసి చట్టాన్ని కాపాడిందన్నారు. ఎమ్మార్పీఎస్ నడిపిన గుండె జబ్బు పిల్లల ఉద్యమం చేసి దేశవ్యాప్త ఆరోగ్యశ్రీ పథకం రావడానికి స్ఫూర్తి నిచ్చిందని అన్నారు. వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్లు పెరగడానికి ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమ ఫలితం అన్నారు. ఆకలి కేకల ఉద్యమ యాత్రతో రేషన్ బియ్యం పెంపు జరిగిందన్నారు. అమరవీరుల తల్లుల కడుపుకోత ఉద్యమంతో అమరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చేసిందని అన్నారు. ఇలాంటి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిరంతరం చేసి సమాజంలోని అన్ని వర్గాలకు అండగా ఎమ్మార్పీఎస్ నిలిచిందని అన్నారు.
వెంకటేశం బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు, రబ్బానీ ఎంఐఎం ఝరాసంగం మండల అధ్యక్షులు, నరసింహ గౌడ్ కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్, ఎజాజ్ బాబా టిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం పట్టణ అధ్యక్షులు, శివరాజ్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులను సన్మానీచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు.జైరాజ్ మాదిగ జిల్లా
ఉపాధ్యక్షులు,నిర్మల్,ధనరాజ్,హనోక్ తరుణ్, నాగేష్, ప్రశాంత్, రాజు,దినాకర్,ప్రశాంత్, నరేష్, ఇమ్మానుయేల్, అభిషేక్, బన్నీ, డాన్నీ, శ్రీను, రమేష్,నర్సిoములు,శ్రీకాంత్,ప్రవీణ్, చిరంజీవి, బాలరాజ్, రహీం, అరుణ్,భాను మాదిగలు పాల్గొన్నారు.