Maha Mrityunjaya Homam Held at Ranjol Rajayogi Ashram
రంజోల్ రాజయోగి ఆశ్రమంలో మృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ రాజయోగి ఆశ్రమంలో న్యాల్కల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో మృత్యుంజయ హోమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ హోమం ద్వారా ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. వేద సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇలాంటి యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..
