యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
సర్పంచ్, పాలకవర్గాన్ని సన్మానించిన గ్రామ నాయకులు, ప్రజలు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రం లో అభివృద్ధి లో భాగంగా ఏర్పాటు చేసిన అంతర్గత సీసీ రోడ్ లు పూర్తి చేసి ఎంపీపీ దర్శనాలు అంజయ్య ముఖ్య అతిధిగా పాల్గొని సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య తో కలిసి ప్రారంభించారు, సర్పంచ్ త్రివేణి దుర్గయ్య మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 98% శాతం సీసీ రోడ్ లు అందరి సహకారం తో పూర్తి చేసాము అని అన్నారు గ్రామాన్ని ఇంతవరకు ఎవ్వరూ చేయని అభివృద్ధి చేసాము, విద్యుత్, నీటి, పరిశుభ్రత, పల్లె ప్రకృతి, ప్రతి ఒక్క చిన్నా సమస్య లు లేకుండా పనిచేసాము అని అన్నారు, ఇదంతా చేయడానికి, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజల సహకారం తో పూర్తి చేయగలిగాము, అని అన్నారు, ఎంపీపీ మాట్లాడతూ
అన్నివిధాలా అభివృద్ధి చేసిన సర్పంచ్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం ఎంపీపీ, నాయకులు, ప్రజలు, సర్పంచ్, పాలకవర్గానికి, శాలువా తో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపినారు
ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ పెండల భారతమ్మ, ఉపసర్పంచ్, రణదీర్ రెడ్డి, వార్డ్ సభ్యులు, రవీందర్ రెడ్డి, బాలరాజు, కరుణ పూరషోత్తంరెడ్డి, రేవతి పరమేష్, డప్పు ముత్తయ్య
కోప్షన్ సభ్యులు, గురుమూర్తి, అన్నం వెంకన్న, భువమ్మా,నాయకులు, గూడెపు పాండు, పూలపల్లి సోమిరెడ్డి, వడకాల రాంరెడ్డి,కడారి సోమన్న,తుప్పతి బీరప్ప,మారశెట్టి మల్లేష్ ,గూడెపు నాగరాజు,లోకేష్, బైయా బిక్షం, డప్పు వెంకన్న, డప్పు( టమాటా )వెంకన్న,బండ కొమురయ్య, పయ్యావుల మచ్చగిరి,గూడెపు వెంకన్న, పంచాయతీ కార్యదర్శి కంచుగట్ల కృష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు