జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లన్న జాతర రెండవ రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే విధిలో భాగంగా శనివారం రోజున ఎంపీడీవో జాతర స్థలాన్ని స్వయంగా సందర్శించి భక్తులకు మంచినీటి సౌకర్యాలు, అత్యవసర వైద్య సదుపాయాలు,స్నాన ఘట్టాలు, పారిశుద్ధ పనులు, ప్రసాదం కౌంటర్లు, స్వామివారి దర్శనం ఏర్పాట్లు, వాహనం పార్కింగ్ లు ఇతర విషయాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు విచ్చేస్తున్న భక్తజన సందోహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తొక్కిసలాటలు జరుగకుండా అధికారులు చూసుకోవాలని తెలిపారు .అలాగే భక్తులందరూ ఓర్పు వహించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గ్రామ కార్యదర్శులు పారిశుద్ధ కార్మికులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.