జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామాన్ని సోమవారం రోజున జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ముఖ్య ప్రాధాన్యత నీటికే ఉంటుంది గనుక గంగిపల్లి గ్రామంలో ఉన్న మంచినీటి సదుపాయాన్ని పర్యవేక్షించి గ్రామస్తులకు మంచినీటి సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ లీకేజీలు, మోటార్లు మరమ్మత్తులు, బోర్ల మరమ్మత్తులు వీటన్నింటిని సత్వరమే పూర్తి చేసి గ్రామస్తులందరికీ అందుబాటులోకి తేవాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి సూచనలు చేయడం జరిగిందని అలాగే వేసవి కాలం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వడదెబ్బ నుంచి కాపాడుకోవాల్సిన విషయాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఏయ్, గ్రామ పంచాయితీ కార్యదర్శి ,గ్రామస్తులు పాల్గొన్నారు.