
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను మంగళవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పర్యవేక్షించారు. పాఠశాల స్టాఫ్ నర్స్ మణిదీపిక ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో ఉన్న 480 మంది విద్యార్థుల హాజరు శాతం ఎప్పటికప్పుడు గమనించాలని,విద్యార్థులకు అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని,చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్ పట్ల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ప్రోగ్రాం ఆఫీసర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పల ప్రసాద్,జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ పాల్గొన్నారు.