చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా లోని ఉత్తమ అధికారులకు అవార్డులు ప్రధానం చేయడం జరిగింది, ఇందులో భాగంగా చిట్యాల మండలంలో ఉత్తమ సేవలందించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రామయ్యకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషమని , మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో తన పాత్ర మరింత పెరిగిందని అన్నారు, జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో రామయ్యను మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు అభినందించారు,