నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలం లోని శ్రీరాములపల్లి గ్రామములో రోడ్ కు ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న త్రాగు నీటి బావిని శుక్రవారం ఎంపిడిఓ బాబు,ఏపిఓ రమేష్ పరిశీలించారు.ప్రమాద కరంగా ఉన్న బావి కి మరమ్మత్తులు చేయాలని గ్రామస్థులు చేసిన విన్నపం మేరకు పరిశీలించినట్లు ఎంపిడిఓ తెలిపారు.బావి పునర్నిర్మాణం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి వారి ఆదేశాల మేరకు తక్షణమే చర్యలు చేపడుతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమములో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దేశిని ఐలయ్య,విరాటి మాధవ రెడ్డి,ప్రవీణ్,రాజు తదితరులు పాల్గొన్నారు.