
నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండల పరిషత్ అభివృద్ధి నూతన అధికారిగా లెక్కల అరుంధతి బుదవారం బాధ్యతలు చేపట్టారు.ఇప్పటి వరకు ఎంపీడీవోగా భాద్యతలు నిర్వహించిన కృష్ణ ప్రసాద్ ములుగు మండలానికి బదిలీ కాగా ఆయన స్థానంలో అరుంధతి చార్జి తీసుకోగా స్థానిక ఎంపీఓ శ్రీధర్ గౌడ్ లతో పాటు సిబ్బంది స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు.అలాగే మండలానికి సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.పలు రికార్డులను పరిశీలించారు.