ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతి,లోకసభ సభ్యురాలు కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో ఇల్లందులో సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధ్యక్షులు,ముఖ్యమంత్రి కేసీఆర్
నవంబర్ 1న ఇల్లందు రానున్న సందర్భంగా
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ప్రజాప్రతినిధులు
సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతి,లోకసభ సభ్యురాలు కవిత, ఎమ్మెల్యే హరిప్రియ
బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 1వ తేదీన ఇల్లందులో పర్యటిస్తారు.ఈ సందర్భంగా జరిగే “ప్రజా ఆశీర్వాద సభ”లో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి సత్యవతి రాథోడ్,లోకసభ సభ్యురాలు,పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత, స్థానిక శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, మహబూబాబాద్ జిల్లా జెడ్పీ ఛైర్మన్ అంగోతు బిందులతో సమీక్ష జరిపారు.ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సుమారు 3గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సభను దిగ్విజయం చేసేందుకు గాను గులాబీ శ్రేణులంతా కార్యోన్ముఖులు కావాలని వారు పిలుపునిచ్చారు.