Date 20/07/2024
—————————————-
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల మృతి చెందిన సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ నాయకులు రాయల చంద్రశేఖర రావుకు ఘనంగా నివాళులర్పించారు.ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం పిండిప్రోలులోని నివాసంలో ఆయన చిత్రపటానికి ఎంపీ రవిచంద్ర పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు.
చంద్రశేఖర రావు భార్య విమల, కుమారుడు పావెల్, వారి కుటుంబ సభ్యులను ఎంపీ వద్దిరాజు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు,అండగా ఉంటానని చెప్పారు,ధైర్యంగా ఉండాలని కోరారు.