Date 03/11/2023
ఎన్నికలప్పుడు మాయ మాటలతో మభ్య పెట్టేవారిని తిప్పికొట్టండి:ఎంపీ రవిచంద్ర*
రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసి, అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుందాం
ఈనెల ఐదున కొత్తగూడెం విచ్చేస్తున్న మహానేత కేసీఆర్ గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం,ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం: ఎంపీ రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.బీఆర్ఎస్ సభ సందర్భంగా ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావులు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, పినపాక, అశ్వారావుపేట ఇంఛార్జిలు సత్యనారాయణ,వెంకటరమణలతో కలిసి తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు
ఎన్నికలప్పుడు డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలతో మభ్య పెట్టేవారిని తిప్పికొట్టండని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు.ఇతర పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుని నియోజకవర్గం ముఖం చూడకుండా హైదరాబాద్ నగరానికే పరిమితమవుతారన్నారు.అందుకు భిన్నంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు,అభ్యర్థులు ప్రతి నిత్యం ప్రజల మధ్యనే ఉంటారని ఎంపీ రవిచంద్ర వివరించారు.ఈనెల 5వ తేదీన (ఎల్లుండి ఆదివారం) కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”నేపథ్యంలో ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జిలు కోనేరు సత్యనారాయణ,ఉప్పల వెంకటరమణలతో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించిన మహానేత చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా శాశ్వతంగా కొనసాగితే బాగుంటుందని ఆకాంక్షించారు.”ప్రజా ఆశీర్వాద సభ”లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు ఈనెల మధ్యాహ్నం కొత్తగూడెం విచ్చేస్తున్న తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసీఆర్ గారికి మనమందరం కూడా అపూర్వ స్వాగతం పలుకుదామన్నారు.గులాబీ శ్రేణులు, అభిమానులు శ్రేయోభిలాషులు, స్థానికులు, చుట్టుపక్కల ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.కేసీఆర్ గారికి ప్రత్యక్షంగా చూసి, జనరంజకమైన ప్రసంగాన్ని వినేందుకు గాను సుమారు 80,000మంది సభకు హాజరు కానున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.సభికులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.అసెంబ్లీలో అందరి కంటే సీనియర్ సభ్యుడిగా ఉన్న వనమాకు ఇవే చిట్టచివరి ఎన్నికలని, నియోజకవర్గాన్ని 3,000కోట్లతో ప్రగతిపథాన పరుగులు పెట్టించిన వెంకటేశ్వరరావు కారు ఓటేసి ఘన విజయం చేకూర్చాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రజలను కోరారు.