
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఇల్లందు నియోజకవర్గం. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఇల్లందులో నవంబర్ ఒకటవ తేదీన జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”ను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కోరుతూ కామేపల్లి మండల నాయకులతో శనివారం భేటీ అయ్యారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్,ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ తదితరులతో కలిసి కామేపల్లి మండలం కొత్త లింగాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులతో సమావేశమయ్యారు.మహానేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రసంగాన్ని వినేందుకు గాను పెద్ద సంఖ్యలో తరలి రావల్సిందిగా గులాబీ శ్రేణులు, ప్రజలను ఎంపీ రవిచంద్ర కోరారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ధనియాకుల హనుమంతరావు,రంగనాథ్, రాందాస్,అచ్చయ్య,మల్లంపాటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.