Date 01/02/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర రావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అసెంబ్లీలోని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛాంబర్ నందు గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు,గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్,సత్యవతి రాథోడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్సీలు సముద్రాల మధుసూదనాచారి,తాతా మధు,దండె విఠల్,తక్కళ్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,మెచ్చా నాగేశ్వరరావులతో కలిసి హాజరయ్యారు.ఆ తర్వాత అసెంబ్లీ లాంజ్ లో ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగులతో పాటు కేసీఆర్ గారిని కలిసి పుష్పగుచ్ఛమిచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అంతకుముందు ఎంపీ రవిచంద్ర నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి శుభాకాంక్షలు
