ఎంపీ వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

*Date 17/09/2024*

—————————————-

*రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు గంగుల కమలాకర్,చామకూర మల్లారెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి తదితర ప్రముఖులతో కలిసి తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు*

*హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17వతేదీన భారత యూనియన్ లో కలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజున బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే*

*ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు,మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే.టీ.రామారావు మంగళవారం తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు*

*ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర పాల్గొని మొదట తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు*

*ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు కేటీఆర్,గంగుల, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి క్షీరాభిషేకం చేశారు, విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు*

*సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్సిన చోట మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఇందుకు స్పందన బీఆర్ఎస్ ప్రముఖులు, నాయకులు,కార్యకర్తలు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*

*ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”జోహార్లు జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు”,”సిగ్గు చేటు సిగ్గు చేటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం సిగ్గు చేటు”,”సిగ్గు సిగ్గు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు సిగ్గు సిగ్గు”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలివ్వడంతో తెలంగాణ భవన్, దాని పరిసరాలు దద్దరిల్లాయి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *