
Vaddiraju Leads BRS Padayatra in Jubilee Hills
ఎంపీ వద్దిరాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాలినడకన ఎన్నికల ప్రచారం
(నేటిధాత్రి)
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాలినడకన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎంపీ రవిచంద్ర కు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావు యూసఫ్ గూడ డివిజన్ బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.శివమ్మ పాపిరెడ్డి హిల్స్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ సభకు ఎంపీ రవిచంద్ర నాయకత్వాన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఎంపీ రవిచంద్ర మంగళవారం ఉదయం యూసఫ్ గూడ డివిజన్ ప్రగతినగర్ నందు కొలువైన వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాలినడకన ఎన్నికల ప్రచారం జరిపారు. ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ సీనియర్
నాయకులు పుస్తె శ్రీకాంత్,ఆశీస్ కుమార్ యాదవ్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్,కోట్ల వినోద్ కుమార్,మంజుల, భాగ్యలక్ష్మీ,విమల తదితరులు తన వెంట రాగా గులాబీ కండువాలు మెడలో వేసుకుని ప్రగతినగర్, లక్ష్మీనరసింహా నగర్,యూసఫ్ గూడ చెక్ పోస్ట్ తదితర చోట్ల పలు వీధుల్లో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు,ప్రజలకు రావలసిన బకాయిలను వివరిస్తూ కార్డులు పంపిణీ చేశారు.గృహిణులు, వ్యాపారస్తులు, మైనారిటీలు, యువకులు, మెకానిక్స్,వృద్ధులను ఎంపీ రవిచంద్ర తదితర నాయకులు కలిసి సర్కారు వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”కారు గుర్తుకే మన ఓటు”,”బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మకే మన ఓటు అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.