ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
“నేటిధాత్రి”న్యూఢిల్లీ, మార్చి, 17:
ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి సోమవారం పరామర్శించారు. పార్లమెంట్ ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో ఈ మేరకు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రజలు, దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల ఎంపీ రవిచంద్ర ఆనందం వ్యక్తం చేశారు. మరింత కాలం ప్రజా సేవకు అంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిని కలిసి పరామర్శించిన వారిలో తెలంగాణకు చెందిన భాజపా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ఉన్నారు.