బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,విప్ దీవకొండ దామోదర్ రావులతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఢిల్లీ వసంత విహార్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారు.ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావు,మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్,బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.