15 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ కవిత

ఆడిటోరియంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ స్పోర్ట్స్ కిడ్స్, పంపిణీ

కారు గుర్తుకు ఓటేయండి అభివృద్ధికి సహకరించండి

డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్

మరిపెడ నేటి ధాత్రి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మండల కేంద్రంలో డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యానాయక్ వివిధ గ్రామాలలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది, రాంపురం గ్రామపంచాయతీ నుండి దాట్ల వెళ్లే రోడ్డు మూడు కోట్లతో మంజూరు చేయడం జరిగిందన్నారు కొత్తూరు లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు,వాళ్లే తండా నుండి దిగుమల్ల వెళ్లే రోడ్డుకు కోటి 20 లక్షలు బీటీ రోడ్డు శంకుస్థాపన చెయ్యడం జరిగింది అన్నారు, బొడతండ నుండి వీరారం రెండు కోట్ల 8 లక్షల రూపాయలతో బీడీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు, అబ్బాయి పాలెం ఎస్డిఎఫ్ నిధుల నుండి కోటి 50 లక్షల తో శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు, గుండె పూడి నుండి బాధ్య తండ వరకు ఒక కోటి 20 లక్షలు రూపాయలు బీటి రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు, ఉల్లేపల్లి నుండి మన్నెగూడెం ఆకీరు నదిపై 15 కోట్ల తో బ్రిడ్జి కోరకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు, ఉల్లపల్లి నుండి బోడ తాండవరకు రెండు కోట్లతో తారు రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు, ధరావత్ తండాలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు 30 లక్షలు ఎస్ డి ఎఫ్ నిధులు నుండి శంకుస్థాపన చేయడం జరిగింది, అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరిపెడ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ కాఫీ, మరియు యువత కు స్పోర్ట్స్ కిట్టు, బతుకమ్మ చీరల పంపిణీ పంపిణీ చేయడం జరిగింది,
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన నిజాయితీతో చిత్త శుద్ధితో కార్యాచరణతో అభివృద్ధి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంటే నాకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.
కచ్చితంగా గెలిచినా అనంతరం గ్రామాల న్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు మీ దగ్గరకు వస్తున్నాయి భాజపా కాంగ్రెస్ పార్టీలను అవదని నమ్మితే మోసపోతామని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా కారు గుర్తుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు,ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారదా రవీందర్,పిఎసిఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర, క్లాస్ వన్ కాoట్రాక్టర్ రామడుగు అచ్యుత్ రావు, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి అశ్విని రవి గౌడ్,మాజీ ఎంపీపీ వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి,మండల రైతు కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్, ఎంపిటిసి కొమ్ము నరేష్, ప్రభాకర్, లావణ్య నరసింహారెడ్డి, పులుసు రంజిత చిరంజీవి, బోడపట్ల సుధాకర్,యామిని రామ్మూర్తి, గాయం జగదీశ్ రెడ్డి,గంట్ల పాపిరెడ్డి, బందు పరశురాములు, శ్వేతా ముఖేష్, తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రఘు గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు నారెడ్డి సుదర్శన్ రెడ్డి,బిఆర్ఎస్ గ్రామ నాయకులు నాగిరెడ్డి, అజ్మీర తండా సర్పంచ్ బానోతు దేవిక శ్రీను నాయక్,మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *