
జమ్మికుంట,: నేటి ధాత్రి
జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గురువారం జమ్మికుంటలో ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తుమ్మేటి సమ్మిరెడ్డి తో ఉన్న సానిహిత్యాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన తర్వాత మొదటిసారి జమ్మికుంటకు వచ్చిన ఈటల రాజేందర్ కు బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈటల వెంట పింగిలి వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ రాజు, మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, శీలం శ్రీనివాస్, కంకణాల సురేందర్ రెడ్డి, జీడి మల్లేష్, ఆకుల రాజేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.