
బిజెపి భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు దేశం లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ అని వారన్నారు 500 సంవత్సరాల కల రామ మందిర నిర్మాణం అయోధ్యలో సహకారం మోడీతో జరిగింది 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ సస్యశ్యామలమైంది త్రిబుల్ తలాక్ రద్దుతో ఎంతోమంది ముస్లిం మహిళలకు న్యాయం జరిగింది అదేవిధంగా అంగన్వాడి సెంటర్లో పౌష్టికాహారం పంపించేది నరేంద్ర మోడీ అని వారన్నారు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఐదు గ్యారంటీలని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేసి వరంగల్ పార్లమెంటు బిజెపి పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సామల మధుసూదన్ రెడ్డి ప్రజలను కోరారు
ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రధాన కార్యదర్శి జోరు కృష్ణ కాంత్ బిజెపి నాయకులు మారెళ్ళ సేనాపతి బూత్ అధ్యక్షులు తోటి రాజు అనిల్ మహేష్ సాయి తదితరులు పాల్గొన్నారు