
# సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
నర్సంపేట,నేటిధాత్రి :
బిజెపి అవలంబిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు.ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులకు స్టడీ సర్కిల్ సమావేశం జిల్లా కార్యదర్శి సభ్యులు ఈసంపెల్లి బాబు అధ్యక్షతన నిర్వహించారు.దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజా సమస్యలను విస్మరిస్తూ ఈ దేశంలో ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి బ్యాంకింగ్ బిఎస్ఎన్ఎల్ విమానయాను రైల్వేలను బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పడం కోసం ప్రైవేటీకరణ చేయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకుందని అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తంగా కారుచౌకగా ఆధాని కంపెనీకి అప్పజెప్తోందని ఆరోపించారు. దేశంలో మతాన్ని కేంద్రం చేసుకొని మత విద్వేషాలను రగిలిస్తూ తన పరిపాలన కొనసాగించుకోవడం కోసం మతకల్లహాలను సృష్టిస్తుందని అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మణిపూర్ లో మనం చూశామని రాబోయే రోజుల్లో బిజెపి అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మతకలహాలు జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురాగా దేశంలోని రైతాంగం ముక్తకంఠంతో వ్యతిరేకించారని సుమారుగా సంవత్సరం పాటు జరిగిన ఈ పోరాటంలో 700 మంది అమాయక రైతులను బలిగొన్న చరిత్ర బిజెపికే ఉందని ఆ తర్వాతే రైతు పోరాటాలకు అలోగి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసిందని పేర్కొన్నారు. దేశంలో తన పరిపాలన కొనసాగించడం కోసం ఎంతటి నీచనికైనా ఒడిగట్టే బిజెపిని ఈ రాబోయే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరబోయిన కుమారస్వామి,జిల్లా కమిటీ సభ్యులు నమండ్ల స్వామి,సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకులు, , బుర్రి ఆంజనేయులు, అక్కపెల్లి సుధాకర్,పెండ్యాల సారయ్య,మొగులోజు శారదా, కంది కొండ రాజు, జగన్నాధం కార్తీక్, కలకోట అనిల్, వజ్జంతి విజయ,ఎండి ఫరిదా, బిట్ర స్వప్న,లక్ష్మి సింగారపు బాబు, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.