నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
హైదరాబాద్ కొకపేటలో శనివారం రోజున తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ సంఘం నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ది రామయ్య,హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించనున్నారు.మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కురుమ సోదరులందరు కార్యక్రమానికి పెద్ద మొత్తంలో కదిలిరావాలని జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం,జిల్లా యువజన అధ్యక్షుడు వెనంక శ్రీనివాస్ తెలియచేశారు.