
Mongoose Attack Injures Five in Zahirabad
కొండముచ్చు వీరంగం.. ఐదుగురిపై దాడి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలో మూడు రోజులుగా ఒక కొండముచ్చు వీరంగం సృష్టిస్తోంది. రాంనగర్, శివాలయం, గాంధీనగర్, శాంతినగర్ ప్రాంతాల్లో ఐదుగురిపై దాడి చేసి గాయపరిచింది. బాధితులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కొండముచ్చు బెడదను నివారించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను బాధితులు కోరుతున్నారు.