వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి పట్టణంలో గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్ల విస్తరణ పనులు ఇంతవరకు పూర్తి కాలేదని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిఎండీ షఫీ శివకుమార్ పాండు రామకృష్ణ రమేష్ యుగంధర్ విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామా టాకీస్ నుండి ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ వరకు బీటీ రోడ్డు వేయకుండా వదిలివేశారని దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు అధికారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకోకుండా పాలిటెక్నిక్ నుండి రామాలయం వరకు అక్కడక్కడ మెట్లను కూల్చి వేయించారని అన్నారు పాలిటెక్నిక్ కాలేజీ నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు సెంటర్ నుండి రైట్ సైడ్ 60 ఫీట్లు ప్రభుత్వ స్థలం ఉన్నదని ఇందులో 20 ఫీట్లు వాకబుల్ రోడ్ కు వదిలి వేసి విస్తరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు వనపర్తి లో రోడ్ల విస్తరణ చేసే ప్రాంతాలు రామాలయం నుండి పాత బజారు వరకు వివరాలు సేకరించారు పూర్తి గాని రోడ్ల విస్తరణ పనులు చేయకుంటే అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామనిఅన్నారు
వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ ఇబ్బందుల్లో వాహనదారులు
