తహసిల్దార్ ఖాజా మెయినుద్దీన్.
చిట్యాల, నేటి ధాత్రి :
పోషణ్ పక్వాడలో భాగంగా భీష్మ నగర్ అంగన్వాడి టీచర్ సుజాత ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల తహసిల్దార్ హాజరైనారు ముందుగా గ్రామ మహిళలందరూ తాసిల్దార్ కి ఘనంగా సన్మానించారు, తర్వాత పొషన్ పక్వాడా గూర్చి జయప్రద సూపర్వైజర్ ప్రతి రోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం చేయాలని అప్పుడే పోషకాహార లోపం రక్తహీనతతగ్గించవచ్చని వివరించారు, తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి బావి పౌరులుగా ఎదుగటానికి అంగన్వాడీ కేంద్రాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని, కేంద్రంలో ఇచ్చే పోషకాహార పదార్థాలన్నీ తల్లులు పిల్లలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్రంలో ఉన్న ఫ్రీ స్కూల్ మెటీరియల్ అంతా చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు, అంగన్వాడి టీచర్ గర్భవతిలుబాలింతలకు పిల్లల తల్లులకు కేంద్రంలో జరిగే కార్యక్రమాలన్నింటిపైన పరీక్ష నిర్వహించి ఆట పోటీల నిర్వహించి గెలుపొందిన తల్లులందరికీ చేతుల మీదుగా బహుమతులు ఇప్పించడం జరిగింది, ముగ్గురు పిల్లలకు అక్షరాభ్యాసము తాసిల్దారు చేతుల మీదుగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్ గ్రామ సెక్రెటరీ మానస, స్కూల్ టీచర్ మంజుల, ఆయ స్వప్న, ఆశ వర్కర్ జ్యోతి, అధిక సంఖ్యలో తల్లులు హాజరైనారు.