బేతేలు ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుక
మాజీ కౌన్సిలర్ మడికొండ శ్రీనివాస్
పరకాల నేటిధాత్రి
మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డ్ సీఎస్ఐ కంపౌండ్ ఆవరణలోని బెతెల్ ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆశ్రమంలోని మథర్ థెరిసా పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించి ఆశ్రమంలోని పిల్లలకు చాక్లెట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదర్ థెరిస్సా సమాజానికి చేసిన సేవలను కొనియాడారు,తన జీవతాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మహనీయురాలని,మానవ సేవే మాధవ సేవ అని బోదించి,సమాజంలోని వికలాంగులను వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకుని,కన్నతల్లి కన్నా కంటికి రెప్పలా కాపాడినారని, అందుకే మదర్ థెరిస అమ్మలా పిలవబడ్డారని,ప్రార్థించే పెదవుల కంటే సాయoచేసే చేతులే మిన్న అని తన జీవితం ద్వారా నిరూపించిన మానవతా మూర్తి,భారతరత్న మదర్ థెరిసా అని కొనియాడారు.