శ్యాంప్రసాద్ ముఖర్జీ.123 వ జయంతి.
బిజెపి మండల శాఖ అధ్యక్షుడువెంకటేష్ గౌడ్.
చిట్యాల, నేటిధాత్రి :
హిందూ జాతీయ వాదమే లక్ష్యంగా..జనసంఘ్ పార్టీని స్థాపించి..అఖండ భారత నిర్మాణం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహోన్నతమైన వ్యక్తి శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి చిట్యాల మండల శాఖ అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. శనివారం శ్యాంప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలన్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ సంకల్పం కోసం ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం శ్రమిస్తున్నారని, అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యజ్ఞంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యేలా నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని వెంకటేష్ గౌడ్ కొనియాడారు
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ గజనాల రవీందర్ అశోక్ చారి మందల మొగిలి సాధసానందం బిజెపి మండల కార్యదర్శి నల్ల శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం మండల అధ్యక్షులు మేదమ్ శ్రీకాంత్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు అంత మహేష్ ఎస్టీ మోర్చ జిల్లా కార్యదర్శికెమ్సరపు ప్రభాకర్ వుమ్మనవేని రాజేష్ చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.