నేటిధాత్రి, వరంగల్
పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే అతి ఉత్కృష్ట సేవా పతకానికి కేయుసి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మల్లారెడ్డి తో పాటు హనుమకొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కే. మహేష్ లు ఎంపికైనారు.అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన మల్లారెడ్డి దామెర మండలం కొగిలివాయి గ్రామానికి చెందిన కాగా, 1990 సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్ గా పోలీస్ శాఖ లో చేరి గూడూరు, కొత్తగూడ, సంగెం,సుబేదారి పోలీస్ స్టేషన్ లో పనిచేయడం పోలీస్, జిల్లా అధికారుల నుండి పలు రివార్డులు, ప్రశంస పత్రాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుండి సేవ, ఉత్తమ సేవా పతకాలను మల్లారెడ్డి అందుకున్నాడు. అలాగే హనుమకొండ జిల్లా, ఉప్పల్ కమలాపూర్ ప్రాంతానికి చెందిన మహేష్ 1996 సంవత్సరంలో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరి సిసిఎస్, మీల్స్ కాలనీ, జనగామ పోలీస్ స్టేషన్ లో సమర్ధవంతంగా నిర్వహించి పోలీస్ అధికారుల నుండి రివార్డులతో పాటు జిల్లా కలెక్టర్ నుండి ప్రశంస పత్రాలను అందుకున్నాడు. అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన మల్లారెడ్డి,మహేష్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు…