జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా ఎస్టిపిపి లోని పరిపాలనా భవనంలో భారతదేశం యొక్క మొదటి ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా జాతీయ ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్) శ్రీ ఎన్ వి రాజశేఖర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈడి శ్రీ ఎన్ వి రాజశేఖర్ రావు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య మనదరికి స్పూర్తిదాయకం అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసి దేశాన్ని క్షామం నుండి విముక్తి చేయడమే కాకుండా ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్తాయికి అభివృద్ధి చేసారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించారన్నారు. మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు. హైదరాబాదు నగరాన్ని మూసి నది వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించారన్నారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మంచి ఆలోచన విధానంతో భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందడంలో కృషి చేశారని తెలియజేసారు. ప్రతి ఒక్కరూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ని స్ఫూర్తిగా తీసుకోని, దేశాభివృద్ధిలో పాటుపడాలని పిలుపునిచ్చారు.
అలాగే మన దేశ అభివృద్ధి లో ఇంజనీర్ ల యొక్క పాత్ర ఏంతో ఉందని , అంతరిక్ష పరిశోదనలో చంద్రయాన్, మంగళ్ యాన్, అటల్ టన్నెల్, చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలో అత్యంత ఎత్తైన మరియు పొడవైన రైల్వే బ్రిడ్జి ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో 5 వ స్థానంలో ఉన్న మనం 2047 వరకు ప్రపంచంలోనే మొదటి స్థానంనకు రావాలని, తలసరి విద్యుత్ వినియోగం కూడా పెరగాలని దానికి తగినట్లుగా మనమంతా ప్రణాళికలతో సంస్థ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మరియు దేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్బంగా అందరికి తెలియజేసారు.ఈ కార్యక్రమములో జీ.ఎం.(పిసిఎస్) శ్రీనివాసులు, చీఫ్(ఓ&ఎం) జే.ఎన్.సింగ్, ఎ.జీ.ఎం(సివిల్)ప్రసాద్, ఎ.జీ.ఎం(ఈ అండ్ ఎం)మదన్ మోహన్,సముద్రాల శ్రీనివాస్,ఎస్వో టు ఈడి ప్రభాకర్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్,ఇతర ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.