మొగుడంపల్లి నాయబ్ తహశీల్దారుగా మొహమ్మద్ జుబేర్ అహ్మద్
జహీరాబాద్. నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల నూతన నాయబ్ తహశీల్దారుగా మొహమ్మద్ జుబేర్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇక్కడ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా విధులు నిర్వహించిన పవన్ కుమార్ నారాయణ ఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా బదిలీ అయ్యారు. అతని స్థానంలో ఇంతవరకు నారాయణ ఖేడ్ డివిజన్ పరిధిలోని కంప్టీ మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా విధులు నిర్వహించిన మొహమ్మద్ జుబేర్ అహ్మద్ ఇక్కడి మండల రెవిన్యూ నాయబ్ తహశీల్దారుగా బదిలీపై వచ్చి, బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నేటి ధాత్రి ‘ తో మాట్లాడుతూ తమ పరిధిలోని బాధ్యతలను సమర్ధవంతంగా నేరవేర్చడంలో తన వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటూ, ప్రభుత్వ పథకాల అమలుకు చర్యలు తీసు కుంటామని ఆయన చెప్పారు. తమ తహశీల్దారు వారి అనుమతితో ప్రధానంగా సన్నబియ్యం పథకం (ప్రజాపంపిణీ రేషన్ బియ్యం) అమలుతో పాటు భూ భారతి చట్టం అమలుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది సహకారంతో స్థానిక రెవిన్యూ సమస్యలను వెనువెంటనే ప్రాధాన్య క్రమంలో పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి కొత్త ఆర్ ఓఆర్ చట్టంపై రెవిన్యూ సిబ్బందికి, రైతులకు అవగాహన కల్పించడానికి ఈనెల 21వ తేదిన అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు రైతులు, అన్ని రాజకీయపక్షాల నాయకులు, అధికారులు, అనధికారులు విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు.