ఎండపల్లి నేటి ధాత్రి
జాతీయ స్థాయి సీనియర్స్ హ్యాండ్ బాల్ పోటీలకు మండలం లోని గుల్ల కోటకు చెందిన మహ్మద్ సన వనం గాయత్రి ఎంపికయ్యారు వివరాలు
గత నెల జరిగిన తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ (HAI) అధ్వర్యంలో ఎల్ బి స్టేడియం హైదరాబాద్ లో జరిగిన 52 వ రాష్ట్ర స్తాయి సీనియర్స్ మహిళల హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు మహమ్మద్ సన,వనం గాయత్రి లు ఎంపిక అయ్యారని పిఈటి మహేష్ తెలియచేశారు. వీరు తేది 07-03-2024 నుండి 12-03-2024 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే 52వ జాతీయ సీనియర్స్ మహిళల హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారు. విరి ఎంపిక పట్ల జగిత్యాల జిల్లా హ్యాండ్ బాల్ సంఘం బాధ్యులు జెట్టిపెళ్లి అశోక్, సిరికొండ వేణు, పిడుగు భాస్కర్, కిషోర్ ,శర్మ లు మరియు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, మాజీ సైనికులు ముదిగంటి రమణారెడ్డి గారు సీనియర్ క్రీడాకారులు మహేష్, సాయికుమార్, మౌనిక, అనూష, మరియు గ్రామస్తులు అభినందించారు