చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నూతన తాసిల్దారుగా మహమ్మద్ ఖాజా మొహియొద్దిన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల చిట్యాలలో నూతనంగా విధులు నిర్వహించిన ప్రహ్లాద్ బదిలీపై మహాదేవపూర్ మండలానికి వెళ్లారు. ప్రస్తుతం నూతనంగా బాధ్యతలు చేపట్టిన తాసిల్దార్ మొహియొద్దిన్ ఏటూరునాగారం నుండి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన తాసిల్దార్ కు డిప్యూటీ తాసిల్దార్ శివతేజ, ఏఎస్ వో సాయి కిరణ్, సీనియర్ అసిస్టెంట్ సాయి జయంత్, జూనియర్ అసిస్టెంట్లు శశి, ప్రేమ్, దేవేందర్, సిబ్బంది కలిసి పుష్పగుచ్చంతో స్వాగతించారు.