
Principal Vijaya Pal Reddy.
బంగారు పథకాలతో మెరిసిన మొగుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు
– ప్రధానోపాధ్యాయులు విజయ పాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పోలీసు శిక్షణ కళాశాల మామునూరు ఆవరణలో 4 వ తెలంగాణ ఎయిర్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన” కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంపు”-7 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగులపల్లి నుండి 12 మంది ఎన్.సి .సి క్యాడేట్స్ పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో వాలీబాల్, టాగ్ ఆఫ్ వార్, ఆటలలో గోల్డ్ మెడల్ సాధించగా, మెరుగు సంజయ్ 100 మీటర్ల పరుగు లో మొదటి స్థానము పొంది గోల్డ్ మెడల్ సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు , విజయ పాల్ రెడ్డి ఎన్సిసి అధికారి జి. రాజయ్య లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని, మంచి ప్రవర్తన, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని, పాఠశాలకు మీ ఊరికి రాష్ట్రానికి , దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా దేశానికి ముగ్గురే ముగ్గురు ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసేవారు, సైనికుడు, రైతు, క్రీడాకారుడు
కావున మంచి చదువుతోపాటు ఆటలలో రాణించి మంచి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సి.సి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీమతి భాగ్యశ్రీ, , శ్రీమతి ఏ.వీ. ఎల్ . కళ్యాణి, జి .అనిల్ కుమార్, బి. కుమారస్వామి కే .ప్రవీణ్, ఎం. రాజు, శ్రీమతి పి. లలిత, జి. విజయ భాస్కర్, శ్రీమతి వై. శ్రీకళ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.