గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపిడిఓ మృతి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మండలంలో ఎంపిడిఓ గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ హుస్సేన్ శనివారం రోజున గుండెపోటుతో మృతి చెందారు.ఎంపిడిఓ హుస్సేన్ స్వగ్రామం హన్మకొండ జిల్లా పరకాల పట్టణం కాగా గత సంవత్సరంలో ప్రమోషన్ తో మొగుళ్లపల్లి మండలానికి ఎంపిడిఓ గా బాధ్యతలు చేపట్టి మండల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి మండల ప్రజల్లో అభిమానం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో టైపిస్ట్ గా బాధ్యతలు చేపట్టి వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ. ఎంపిడిఓ గా మండలంలో పనిచేస్తున్న హుస్సేన్ నెల రోజుల్లో పదవి విరమణ పొందనున్నారు. గత మూడు రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని ఆఫీస్ లో సెలవు తీసుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో హటాత్తుగా గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపిడిఓ హుస్సేన్ మృతితో మొగుళ్లపల్లి ఎంపిడిఓ కార్యాలయం మూగబోయింది ఎంపిడిఓ హుస్సేన్ మరణవార్తతో మండలంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు.