-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొండా యువసేన జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
ఇటీవలే మొగుళ్ళపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలను స్వీకరించిన బి అశోక్ ను తన చాంబర్ లో కొండా యువసేన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు ప్రజల సహకారంతోపాటు..కొండా యువసేన నాయకుల సహకారం తమకు ఉంటుందని ఆయన తెలిపారు.