
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నిరాడంబరంగా నిర్వహించారు.రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.భారత ప్రధాన మంత్రుల్లో దేశాన్ని ముందుకు నడిపించిన ప్రధానుల్లో ముందు వరసలో ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్,గోపతి రాజయ్య,పుర వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,అఫ్జల్ లాడెన్, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, యాకూబ్ అలీ, ఆకుల రాజన్న, గోపతి భానేశ్,పలిగిరి కనకరాజు,బింగి శివ కిరణ్, పుల్లూరి కల్యాణ్, మహిళా నాయకురాళ్ళు రాజేశ్వరి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.