కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగొండ మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మోడెం ఉమేష్ గౌడ్ మరికొంత మంది ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, కుల సంఘ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో రేగొండ ఎంపీటీసి మైస సుమలత – భిక్షపతి, దమ్మన్నపేట గ్రామ మాజీ సర్పంచ్ నడిపెల్లి శ్రీనివాస్ రావు, పోచంపల్లి గ్రామ ఎంపీటీసి కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రేగొండ మండల గౌడ సంఘం నాయకులు మాడగాని శంకర్, గండి శంకర్ లతో పాటు మరో 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో పలువురు ఉమ్మడి రేగొండ మండల నాయకులు ఉన్నారు.