నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంకి (2024-25) 6వ తరగతిలో 100 సీట్లకి, ఏడు నుండి పదవ తరగతి వరకు గల ఖాళీ సీట్లకు ఫిబ్రవరి 22వ తారీకు వరకు telanganams.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ పాఠశాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థిని విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత మధ్యాహ్న భోజన పథకం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు మరియు రెండు జతల యూనిఫామ్ లు అందిస్తున్నట్లు తెలియజేశారు. కావున మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రిన్సిపాల్ సుమన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
మోడల్ స్కూల్ అడ్మిషన్స్ ప్రారంభం
