
Balaji Techno School.
బాలాజీ టెక్నోస్కూల్ లో – విద్యార్థుల మాక్ ఎలక్షన్స్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో విద్యార్థులలో ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు మాక్ ఓటింగ్ నిర్వహించారు.ఓటింగ్ లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి అని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య దేశాలలో రహస్య బాలెట్ ద్వారా తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు.భవిష్యత్తులో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని అప్పుడే సుస్థిరపాలన అందుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బిట్స్ సెక్రటరీ డాక్టర్ జి .రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా చాగంటి క్రాంతి కుమార్ పోలింగ్ ఆఫీసర్ గా ఎం.డి రియాజుద్దీన్ పోలింగ్ సిబ్బంది గా ఉపాధ్యాయులు ఆర్లయ్య , అనిల్ , శంకర్ బాబు , సంగీత, సతీష్, కవిత పాల్గొన్నారు. ఎన్.సి.సి క్యాడేట్లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విధులు నిర్వహించారు.అనంతరం తెలంగాణ వన మహోత్సవం 2025 కార్యక్రమం లో భాగంగా బాలాజీ టెక్నో స్కూల్ లో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి మొక్కలు నాటారు.