
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల నుంచి హైదరాబాదులో ఇందిరా పార్కులో జరిగే మహాధర్నా కార్యక్రమానికి మండలం నుండి ఎమ్మార్పీఎస్పీ నాయకులు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లారం చంద్రం ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు హైదరాబాదులో జరిగే మహా ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతూ మొన్న జరిగిన ఎంపీ టికెట్ల విషయంలో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ మాదిగల టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని దాని తీరుకు వ్యతిరేకంగా అలాగే మాదిగ జాతిని మోసం చేస్తున్న తీరుకువ్యతిరేకంగా ఎంపీ సీట్లు మాదిగలకు కేటాయించకుండా మన జాతిని అవమానిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మరియు మోత్కుపల్లి నర్సింలు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారని ఇట్టి కార్యక్రమానికి తంగళ్ళపల్లి మండలం నుండి ముఖ్య కార్యకర్తలు మహా ధర్నా సభకు బయలుదేరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు